ఎల్లమ్మ ఆలయంలో చోరీ
19-08-2026 09:40 PM
బోధన్,(విజయ క్రాంతి): ఎడపల్లి మండలంలోని జైథాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల 17/18వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలోని సుమారు 5 గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి తొట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై జైథాపూర్ సర్పంచ్ ఎడపల్లి ఎస్ఐ రమా లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






