పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రము లోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ సమస్యలపై గ్రామ పంచాయతీ కార్మికులు నిరాహారదీక్షలు రెండోవ రోజు చేపట్టారు.
ఎంపీడీవో ఎస్ వి సత్యనారాయణ,ఎంపీఓ రమేష్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రెండోవ రోజు జరిగిన నిరాహారదీక్షలలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా తిర్చిదిద్దుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు అనారోగ్యలు రాకుండా గ్రామీణ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పంచాయతీ కార్మికులు సేవలు అందిస్తున్నారని తెలిపారు . పారిశుధ్య కార్మికులు ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ పని భద్రత కరువుయిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించినప్పటికీ అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిన పంచాయతీ కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగిస్తున్న సర్పంచుల పైన ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.






