కరీంనగర్‌లో ఘనంగా వైశ్యభవన్ పునర్నిర్మాణ భూమిపూజ
20-08-2026 12:00 AM
హాజరైన కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ క్రైం, ఆగస్టు 19 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లో ఉన్న వైశ్య భవన్ ను అత్యాధునిక హంగులతో నూతన కన్వెన్షన్ హాల్ గా పునర్నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్యసేవ కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్, కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి రమేష్, సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు






