20 August, 2026 | 3:30 AM

ఉస్మాన్‌సాగర్ సాక్షిగా ‘మట్టి’ దోపిడీ!

20-08-2026 12:00 AM
  1. గండిపేట చెరువుకు ముప్పు..
  2. జన్వాడలోని సర్వే నెంబర్ 583లో పదెకరాల్లో 15 అడుగుల లోతుకు తవ్వకాలు? 
  3. చెరువు భూమిని తవ్వి ఏపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భూమిలోకి తరలింపు...-
  4. రోజూ వందలాది టిప్పర్లు తిరుగుతున్నా అధికారుల నిఘా ఏది?
  5. జలాశయ పరీవాహక ప్రాంత భద్రతపై తీవ్ర ఆందోళన

శంకర్‌పల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): రాజధాని హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చే చారిత్రక ఉస్మాన్ సాగర్ (గండిపే ట) జలాశయం పరీవాహక ప్రాంతంలో భా రీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో సర్వే నెంబరు 583 లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 15 అడుగుల లోతు వరకు మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

భారీ యంత్రాలు (ఈటచ్)లతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా తరలి స్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గండిపేట చెరువులో మట్టి తవ్వకాలు నిర్వహించి ఏపీకి చెందిన ఓ ప్రజా ప్ర తినిధి శిఖం పట్టా భూమిలోకి నింపి చదును చేయడం జరుగుతుందని, ఈ వ్యవహారం అంతా అధికారుల కనుసైగల్లోనే సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

10 ఎకరాల్లో భారీ తవ్వకాలు!

సాధారణంగా వ్యవసాయ భూముల్లో చిన్నపాటి మట్టి తరలింపులు కనిపిస్తుంటా యి. అయితే జన్వాడలో మాత్రం విస్తారమైన ప్రాంతంలో భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి స్వరూపమే మారిపోయే స్థాయిలో లోతుగా తవ్వకాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

అసలు ఈ తవ్వకాలకు ఎవరి అనుమతు లు ఉన్నాయి? ఎంత పరిమాణంలో మట్టిని తవ్వేందుకు అనుమతి ఇచ్చారు? అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు జరుగుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారిం ది. చెరువు భూమిలో మట్టి తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.- 

వందలాది టిప్పర్లు... అధికారుల నిఘా ఏది?

భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లే కుండా పెద్ద ఎత్తున తవ్వకాలు సాగుతుండటంతో పాటు టిప్పర్ల ద్వారా మట్టిని తరలి స్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగుతు న్నా రెవెన్యూ, మైన్స్, ఇరిగేషన్ శాఖల అధికారులు స్పందించకపోవడం చర్చనీయాం శంగా మారింది. తవ్వకాల ప్రదేశాన్ని అధికారులు పరిశీలించి, అనుమతులు ఉన్నా యా? ఉంటే వాటి పరిధి ఎంత? నిబంధన లు పాటిస్తున్నారా? అన్న విషయాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ వినిపిస్తోంది.

జలాశయ భద్రతపై ప్రభావం ఏమిటి?

ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతం హై దరాబాద్ తాగునీటి భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతం. సహజ నీటి ప్రవాహ మా ర్గాలు, వర్షపు నీరు చేరే ప్రాంతాలు, భూగ ర్భ జలాల రీఛార్జ్ ప్రాంతాల్లో అనుమతుల్లేకుండా భారీ తవ్వకాలు జరిగితే పర్యావర ణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి స్వరూపంలో భారీ మార్పు లు భవిష్యత్లో నీటి ప్రవాహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

అధికారుల ముందున్న ప్రశ్నలు

రెవెన్యూ శాఖ: తవ్వకాలు జరుగుతున్న భూమి స్వరూపం ఏమిటి? భూ వినియోగంలో ఏమైనా మార్పులు జరిగాయా? త వ్వకాలకు అనుమతులు ఉన్నాయా? మైన్స్ అండ్ జియాలజీ శాఖ: మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చారా? సీనరేజ్/రాయల్టీ చెల్లించారా? అనుమతించిన పరిమాణం ఎంత? ఇప్పటివరకుఎంత మట్టి తరలించారు? 

జలమండలి: ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంత రక్షణకు తీసుకున్న చర్యలేమిటి? తవ్వకాలు జలాశయ పరివాహక ప్రాంతంపై ప్రభావం చూపుతున్నాయా? 

ఇరిగేషన్ శాఖ: తవ్వకాలు జలాశయ భద్రతకు, సహజ నీటి ప్రవాహాలకు ఎలాంటి ముప్పు కలిగిస్తున్నాయన్న అంశంపై పరిశీలన జరిగిందా? నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవా? అనుమతులు లేకుండా మట్టి లేదా ఇతర ఖనిజ పదార్థాల తవ్వకాలు, రవాణా జరిగితే సంబంధిత మైనింగ్ నిబంధనలు, పర్యావరణ నిబంధనలు, భూగర్భ జలాలుభూవినియోగానికి సంబంధించిన చట్టాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మైన్స్ అండ్ మినిరాల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ ) Act, 1957తో పాటు తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ (వాల్టా ) చట్టం తదితర నిబంధనలు వర్తిస్తాయా అన్నదానిపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

జాయింట్ ఇన్స్‌పెక్షన్‌కు డిమాండ్

ఉస్మాన్ సాగర్ వంటి కీలకమైన తాగునీటి వనరుకు సమీపంలో ఇంత భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ, ఇరిగేషన్, జలమండలి అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, తవ్విన మట్టి పరిమాణం, తరలింపు వాహనాలు, చెల్లించిన రాయల్టీ తదితర వివరాలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయాలని కోరుతున్నారు.ఉస్మాన్ సాగర్ భద్రతను పణంగా పెట్టి అక్రమ తవ్వకాలకు అవకాశం ఇస్తే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, రాజకీయ లేదా ఇతర పలుకుబడులకు తావులేకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.