4 May, 2026 | 10:18 PM

శ్రీ జగదాంబ మాత సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ దేవాలయాలలో ప్రత్యేక పూజలు

04-05-2026 09:03 PM

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని భీమ్లా తాండ గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాలో శ్రీశ్రీ జగదాంబ మాత, శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నర్సాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దేవాలయాలను దర్శించుకున్నారు.

అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ని ఘనంగాసన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... శ్రీ జగదాంబ మాత సేవలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అని అన్నారు.