29 July, 2026 | 9:05 PM

మధుర దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

29-07-2026 08:24 PM

నర్సాపూర్,(హత్నూర): గురు పౌర్ణమి సందర్భంగా హత్నూర మండలంలోని మధుర దత్తాత్రేయ క్షేత్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, అర్చనలో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షంతో ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురు పౌర్ణమి ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పర్వదినమని పేర్కొన్నారు.

దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం, పుష్పయాగం, చండీ హోమం, గురుపూజ, గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ, గంగా హారతి, ఊయల సేవ తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు.