చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
నర్సాపూర్,(హత్నూర): ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు.హత్నూర మండలంలోని కాసాల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలు, కల్తీ విత్తనాల విక్రయం, నకిలీ కేసులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాణ్యమైనవిత్తనాలు వినియోగించి మంచి దిగుబడులు సాధించాలని తెలిపారు.
నాల్సా జాగృతి పథకం ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, విత్తనాల పంపిణీలో అవకతవకలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, తహసీల్దార్ ఫర్హాన్ షేక్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు,ఉద్యానవన శాఖ అధికారి పాండు, శాస్త్రవేత్త అరుణ తదితరులు పాల్గొన్నారు.






