29 July, 2026 | 9:37 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

ఎల్‌నినో ప్రభావం...ఆయిల్ ఫామ్ ఆరుతడి పంటలపై దృష్టి

29-07-2026 08:27 PM

– జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్

నర్సాపూర్ (హత్నూర): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు వరి సాగును తగ్గించి ఆయిల్ ఫామ్‌తో పాటు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. హత్నూర మండలం కాసాల శివారులోని దౌల్తాబాద్ రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాలో ఆయన మాట్లాడుతూ... భూగర్భ జలాల సంరక్షణ కోసం బోర్ల కింద వరి సాగును పరిమితం చేసి, కంది, జొన్న, అముదం, ఇతర పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

ఈసందర్భగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి, శాస్త్రవేత్త డా. అరుణ మాట్లాడుతూ, తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగు రైతులకు అనుకూలమని తెలిపారు. ఒక ఎకరం వరికి వినియోగించే నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చని, ఈ పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యతో కలిసి ప్రారంభించగా, తహసీల్దార్ ఫర్హన్ షేక్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.