16 March, 2026 | 4:24 PM

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

16-03-2026 12:00 AM

నాగల్ గిద్ద, మార్చి15: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనం, పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు మహిళా సమైక్య భవనాలు కీలకమని, ఈ భవనం ద్వారా మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం విద్యార్థుల భద్రతను మరింత బలోపేతం చేస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నాగల్ గిద్ద మండలానికి ఎస్సీ హాస్టల్, గురుకుల పాఠశాల మంజూరయ్యాయని, వాటిని కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

గ్రామాలలో నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్, సంజు పాటిల్, గుండేరావు పాటిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.