16 March, 2026 | 3:11 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం

16-03-2026 12:00 AM

కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ మార్చి 15 (విజయక్రాంతి) : ఎస్సీ యాక్షన్ ప్లాన్ 202526లో భాగంగా బ్యాంక్ అనుసంధానంతో ఎస్సీ వర్గాలకు వివిధ ఉపకరణాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు సబ్సిడీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాల కోసం 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు, ఇతర వ్యవసాయ ఆధారిత పథకాల కోసం 21 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించకూడదని, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం,

ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్బుక్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ కూడా జతపరచాలని సూచించారు.ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 17 నుండి 24 వరకు tsobmms.cgg.gov.in వ్బుసైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ వర్గాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.