16-02-2026 01:34:32 PM
ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మూడేళ్లలో పార్టీలకతీతంగా అభివృద్ధే మా లక్ష్యమని కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శకంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం మీడియా ముందు చెప్పారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల సహకారం తీసుకుంటామని అన్నారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.