పాఠశాలను తనిఖీ చేసిన ఎంఎల్ఏ
27-06-2026 05:47 PM
హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల ZPSS పాఠశాలను మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల గదులను పరిశీలించి, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో మాట్లాడీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు సమస్య ఉందని చెప్పగానే ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడి వెంటనే పాఠశాలలో ఉన్న మంచినీరు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదుల్లో కుర్చీలు, బెంచీలు ఇతర అవసరాలు ఏమున్నా కూడా మూడు నెలల్లోపు పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎం ఎల్ ఏ వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






