గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడవద్దు, అప్రమత్తంగా ఉండాలి
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ అల్లాపూర్ లోని పీఎం శ్రీ టీజీఆర్జేసీ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ప్రత్యేక అధికారి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్శనలో భాగంగా పాఠశాల ప్రాంగణం, వంటగది, స్టాక్ రూమ్‌లను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ తనిఖీలో ఎలాంటి పెద్ద లోపాలు కనిపించలేదని ప్రాంగణం సంతృప్తికరంగా ఉందని, అయితే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వంటగది, పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.






