అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట గ్రామంలో శనివారం సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ ఆధ్వర్యంలో డాక్టర్ గునిగంటి .ప్రభాకర్ రావు జన్మదిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారి మేనకోడలు సురభి. నిర్మలసత్యం రావు చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా భాగానికి చెందిన వస్తువులను అందజేశారు, అలాగే స్కూల్ కొరకై సౌండ్ సిస్టం అందజేశారు.
అనంతరం హరిజనవాడ ప్రైమరీ స్కూల్, జడ్పీహెచ్ఎస్ ప్రైమరీ స్కూల్, జడ్పిహెచ్ఎస్ స్కూల్ 370 మంది విద్యార్థిని విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, మరియు,ఉపసర్పంచ్ సత్య గుడ్ , స్కూల్ చైర్మన్ పద్మ, వార్డు సభ్యులు, ఈశ్వర్ గౌడ్, ఫిరంగి అశోక్, బిలకుర్తి నికిత, బుసపురం కవిత, మరియు గ్రామస్తులు పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి , గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.






