4 May, 2026 | 6:45 PM

ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేస్తున్న పాపిష్టి ప్రతిపక్షం.!

04-05-2026 05:22 PM

రైతన్నలకు ఇసుమంత ఇబ్బంది రాకుండా చూసుకుంటాం 

ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందృ నాయక్

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో రోజురోజుకు ప్రజల్లో తమ ఉనికి కోల్పోతున్నామనే ఆక్రోషంతో ప్రకృతి వైపరీత్యాలను సైతం పాపిష్టి బీఆర్ఎస్ ప్రతిపక్షం రాజకీయం చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా సూదనపల్లిలో పిడుగుపాటుతో మృతిచెందిన నీలం వెంకన్న కుటుంబాన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు.

వెంకన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే ప్రతి సహాయం వేగంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెంకన్న మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల చేత తిరస్కరించబడ్డ వారితో చెప్పించుకోవాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.