calender_icon.png 7 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహం సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

07-02-2026 12:34:45 PM

విద్యార్థుల పరామర్శ

మెరుగైన వైద్యం అందించాలి ఆదేశం..

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో బాలికల సమీకృత వసతిగృహం లో విద్యార్థుల అస్వస్థతకు కారణమైన సిబ్బందిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై బెల్లంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల పరామర్శించారు. ఎలా జరిగింది ఏం తిన్నారు అనే విషయాన్ని విద్యార్థులు అడిగి ఆయన తెలుసుకున్నారు.

విద్యార్థినిలు జరిగిన విషయాన్ని వివరించారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని  సూపర్డెంట్ రవి నీ ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం బెల్లంపల్లి బస్సులోని వసతి గృహానికి వెళ్లి సందర్శించారు. అక్కడ విద్యార్థులకు వడ్డించిన భోజనాలు వగైరా ఉన్నారు. నాన్న తెలియని ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడo పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు పలకాట మాడితే సహించేది లేదని హెచ్చరించారు. వసతిగృహం వార్డెన్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో సెల్ఫోన్తో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతతో పని చేయాలని చెప్పారు.