calender_icon.png 7 February, 2026 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శెట్టుపల్లి గుట్టపై లారీ పల్టీ

07-02-2026 11:36:16 AM

మానవత్వం చాటుకున్న సర్పంచ్ ఢిల్లీ వసంత రావు

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని శెట్టుపల్లి గుట్టపై శుక్రవారం రాత్రి 9.50 కి ఒక లారీ నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. శెట్టుపల్లి - కొమరారం మార్గమధ్యమంలో ఈ ఘటన చోటుచేసుకోగా అదే సమయంలో అటుగా వెళ్తున్న శెట్టుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఢిల్లీ వసంత రావు వెంటనే స్పందించి తీవ్ర గాయాలైన లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ను తన వాహనంలో కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సర్పంచ్ ను అభిందించారు.