21 April, 2026 | 8:35 PM

చెరువుల మరమ్మతులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

21-04-2026 06:48 PM

లక్ష్మణచందా,(విజయక్రాంతి): మండల కేంద్రంలో రూ.14 లక్షలతో ఊర చెరువు మరమ్మతులకు, రూ. 8లక్షలతో పులి చెరువు మరమ్మతులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. చెరువుల మరమ్మత్తుల నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి గ్రామ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామంలో మార్కండేయ స్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా మహేశ్వర్ రెడ్డి గారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఓస కవితా రాజు సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేష్,  మండల బీజేపీ  నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, తదితరులు పాల్గొన్నారు.