10 March, 2026 | 4:20 AM

ఇరాన్‌పై మిస్సైళ్ల తుఫాన్

09-03-2026 02:41 AM

ఒకేసారి 12వేల బాంబులు, 80 ఫైటర్ జెట్స్‌తో బీభత్సం

ఇంధన డిపోలపై తొలిసారిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు

శనివారం రాత్రంతా టెహ్రాన్‌పై క్షిపణుల వర్షం

ఐఆర్‌జీసీ బేస్ క్యాంప్, పోలీసు స్టేషన్ పేల్చివేత

తాజా దాడుల్లో 20 మంది మృతి

టెహ్రాన్, మార్చి 8: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బా ంబుల తుఫాన్ బీభత్సం చేసింది. 80 ఫైటర్ జెట్స్‌తో ఒకేసారి 12వేల బాంబులేస్తూ విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో తాజాగా 20 మందికి పైగా పౌరులు మృతిచెందారు. అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులు టెహ్రాన్‌ను విధ్వంసం చేస్తున్నాయి. ఆదివారం ఇరాన్‌పై బీభత్సం జరుగుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ బేస్ క్యాం ప్‌ను ఇజ్రాయెల్ పేల్చేసింది. టెహ్రాన్‌లోని ఇంధన స్థావరాల ట్యాంకులు భారీగా ధ్వంసమయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్ కాలిబూడిదైంది. ఇరాన్‌కు ఆయువు పట్టు(ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపో)లపై తెల్లవారు జామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు చేసింది. ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో పేలుళ్లతో దద్దరిలింది. దీంతో మంటలు, పొగలు కమ్మేశాయి. ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యంతోపాటు అనేక శాఖలకు రవాణా చేస్తుంటుందని ఐడీఎఫ్ తెలిపింది.

దక్షిన టెహ్రాన్ టోండ్‌గౌయాన్‌లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్‌పై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. మొ త్తం మూడు డిపోల్లో మంటలు వ్యాపించాయి. అర్ధరాత్రతా టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ వారం రోజుల్లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 394 మంది మరణించారు. ఈ మృతుల్లో 83 మంది పిల్లలు ఉన్నారు. దేశవ్యా ప్తంగా ఇజ్రాయెల్ దాడులు ఈ మేరకు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. లెబనాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో గత కొన్ని రోజులుగా ప్రాణనష్టం నమో దైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

బ్రిటిష్ స్థావరంపై డ్రోన్ దాడి చేయలేదు: లెబనాన్

బ్రిటిష్ వైమానిక స్థావరంపై తాము డ్రోన్ దాడి చేయలేదని లెబనాన్ తెలిపింది. సైప్రస్ దక్షిణ తీరంలో బ్రిటీష్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, తాము ఏ దాడికి యత్నించలేదని లెబనాన్ అత్యున్నత దౌత్యవేత్త పేర్కొన్నారు. లెబనాన్ ఎటాక్ చేసినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోమవారం బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అక్రోటిరి స్థావరంపై లెబనాన్ డ్రోన్ దాడి జరిగిందని సైప్రియట్ కౌంటర్ కాన్‌స్టాంటినోస్ కోంబోస్ చేసిన వ్యాఖ్యలను ఆదివారం ఆయన ఖండించారు.  

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికుడి మృతి

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికుడు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ధృవీకరించింది. ఆ సైనికుడిని ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్‌లోని మజ్దల్ షామ్స్‌కు చెందిన మహర్ ఖతార్(38)గా గుర్తించారు. అతను పోరాట ఇంజనీరింగ్ ఫోర్సుగా  పనిచేశాడని సైన్యం తెలిపింది.

ఇరాన్‌లో 3,400, లెబనాన్‌లో 600 లక్ష్యాలు ధ్వంసం

అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్‌లో 3,400 లక్ష్యాలను, లెబనాన్‌లో 600 కంటే ఎక్కువ లక్ష్యాలను ఢీకొట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. ఇరాన్ క్షిపణి లాంచర్లు దాదాపు 60 శాతం నాశనమయ్యాయని, ప్రయోగాల్లో అడ్డంకి ఏర్పడినట్లు సమాచారం. ఆ దేశ బాంబుల సామగ్రిని గణనీయంగా తగ్గించిందని ఇజ్రాయెల్ విశ్వసిస్తున్నట్లు సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషాని పేర్కొన్నారు.

ఇరాన్ స్పేస్ సెంటర్‌ను ఢీకొట్టిన ఇజ్రాయెల్

అంతరిక్ష సంస్థ ప్రధానకార్యాలయాన్ని, ఇతర లక్ష్యాలను ఢీకొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం టెహ్రాన్‌లో మరోసారి వైమానిక దాడులు నిర్వహించిందని పేర్కొంది. రివల్యూషనరీ గార్డ్‌తో అనుసంధానిం చబడిన ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని చెప్పింది. ఈ సౌకర్యాన్ని ‘ఐఆర్‌జీసీ ఉగ్రవాద కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఇజ్రాయెల్ రాష్ట్రం, మా ప్రజలను  పర్యవేక్షించడానికి ఉపయోగించిందని‘ సైన్యం తెలిపింది. గార్డ్ అంతర్గత భద్రతా కమాండ్ సెంటర్‌ను, 50 ఆయుధ సామగ్రి బంకర్లు, దాని గ్రౌండ్ ఫోర్సెస్‌ను వలంటీర్ బాసిజ్ దళం స్థావరం వంటి ఇతర లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 

ఇరాన్ డ్రోన్‌ల కట్టడికి ఉక్రెయిన్ సాయం

ఇరాన్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి అమెరికా, మధ్యప్రాశ్య దేశాలకు సహాయం చేయడానికి ఉక్రెయిన్ నిపుణులను పంపనుంది. ఇరాన్ డ్రోన్ దాడులకు చెక్‌పెట్టడానికి అమెరికా, ఇతర మధ్యప్రాశ్య దేశాలకు సహాయం చేయడానికి ఉక్రెయిన్ వచ్చే వారం నిపుణులను పంపాలని ఆలోచిస్తున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం తెలిపారు. డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్తో కలిసి కైవ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ, ఉక్రేనియన్ నిపుణులు పరిస్థితిని అంచనా వేయడానికి ‘స్థలంలో‘ ఉంటారని, అయితే వారి ఖచ్చితమైన స్థానం లేదా రాక తేదీపై వివరాలను ఆయన అందించలేనట్లు సమాచారం. అయితే ‘ఉక్రెయిన్ వాషింగ్టన్, ఇతర దేశాలకు అవసరమైన అన్ని రకాలుగా సహాయం చేస్తుంది.- షాహెద్ డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మొదలైన వాటి నుంచి రక్షించడంలో మా సైన్యం, అన్నిటికంటే ముఖ్యమైన నైపుణ్యం, అనుభవమని ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి:

గల్ఫ్ దేశాలపై ఆగని ఇరాన్ దాడి

నేపాల్ ప్రధానిగా బాలెన్ షా

అమెరికా–ఇజ్రాయెల్ దాడులు