21 June, 2026 | 2:00 AM

రైజ్ ఆఫ్ లింగా..

21-06-2026 12:51 AM

హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ ప్రాజెక్టుకు రవి అరుసు కథను అందించారు. విశాల్ 35వ ప్రాజెక్టుగా రాబోతోన్న ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలమ్స్ బ్యానర్‌పై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారు. అందులో లింగా అనే పవర్ ఫుల్ పాత్ర ఒకటి.

ఈ మేరకు ‘రైజ్ ఆఫ్ లింగా’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను విశాల్, జీవీ ప్రకాశ్ సంయుక్తంగా ఆలపించారు. ఈ పాట చూస్తుంటే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటర్‌గా, దురైరాజ్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.