బండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్
- ఇంజినీరింగ్ పరీక్షల కోసం మంజూరు చేసిన మల్కాజిగిరి కోర్టు
- ఈ నెల 26 వరకు వర్తింపు
- చర్లపల్లి జైలు నుంచి విడుదల
- సుమారు నెల రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు శనివారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండ టంతో ఈ నెల 26 వరకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి ఆయన దాదాపు నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
కేసు నమోదు అనంతరం ముందస్తు బెయిల్ లేదా అరెస్టు తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్‌కు విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని మరోసారి భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. విద్యా భవిష్యత్తు దృష్ట్యా మల్కాజిగిరి కోర్టు జూన్ 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.






