21 June, 2026 | 1:05 AM

లబ్ధిదారులకు అండగా ప్రజా ప్రభుత్వం

21-06-2026 12:03 AM
  1. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  3. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

మంథని, జూన్20 (విజయక్రాంతి) : నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మంథని నియోజకవర్గం లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పాలకుర్తి మండలాలకు చెందిన పలు వురు మహిళా లబ్ధిదారులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం మంథనిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోందన్నారు.  

కవితకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

పది సంవత్సరాల పాటు కుటుంబ పాలన కొనసాగించి, ఇప్పుడు ఉనికిని కాపాడుకునేందుకు విమర్శలు చేయడం హాస్యాస్పదమని   మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థను నష్టాల ఊబి నుంచి కాపాడి, పున రుజ్జీవింపజేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. గత పదేళ్లలో మునుపటి ప్రభుత్వం సింగరేణి సంస్థ అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్నప్పటికీ, తనను నమ్మి ఐదు సార్లు గెలిపించిన మంథని ప్రజల రుణం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. మంథని పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, పను ల వల్ల ప్రజలకు ఎదురయ్యే చిన్నపాటి అసౌకర్యాలను భరించి సహకరించాలని కోరారు. మంథని పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పుకు స్థానిక ప్రజలు, వ్యాపారులు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

కాగా మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్ మండలాలకు చెందిన మొత్తం 109 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఇం దులో 64 మందికి సీఎంఆర్‌ఎఫ్ కింద, 45 మందికి కల్యాణలక్ష్మి పథకం కింద మొత్తం రూ.66 లక్షల విలువైన ఆర్థిక సహాయా న్ని అందించారు. కాగా చెక్కులు అం దుకున్న లబ్ధిదారులు, తమకు లభించిన ఆర్థిక సహాయం పట్ల సంతో షం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాద వ్, మండల అధ్యక్షుడు ఐళి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుడుదల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు శశి భూషణ్ కాచే, కొండ శంకర్, ఆకుల కిరణ్, అజీమ్ ఖాన్, ఆర్డీవో సురేష్ తాసీల్దార్ ఆరిఫోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.