10 March, 2026 | 11:35 AM

గల్ఫ్ దేశాలపై ఆగని ఇరాన్ దాడి

09-03-2026 02:37 AM

రాత్రంతా మరోసారి మిస్సైళ్లు, డ్రోన్ల వర్షం 

మంటల్లో కువైట్‌లోని భారీ టవర్

మరోసారి ఇరాన్ దాడులు చేసిందన్న కువైట్ రక్షణశాఖ 

సౌదీ అరేబియా, ఖతార్‌లోనూ బాంబుల మోత 

దుబాయ్‌పై క్షిపణులు, డ్రోన్లతో బీభత్సం 

దుబాయ్‌లోని 23 మెరీనాపై డ్రోన్ ఎటాక్

టెహ్రాన్/బీరుట్, మార్చి 8: పశ్చిమాసియాలో 9వ రోజు ఆదివారం అమెరికా, ఇ జ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడ్డాయి. ఇరాన్ సైతం ఇ జ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. అయితే తమ పొరుగు దేశాలపై దాడులు ఆపేస్తామని ప్రకటించిన ఇరాన్ మాట తప్పింది. గల్ఫ్‌దేశాల్లో ఇరాన్ విధ్వంసం సృష్టిస్తోంది. శనివారం రాత్రి అంతా మరోసారి మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు ప్రజలు తీవ్రంగా గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది.

డ్రోన్ల శకలాలు పడడంతో నగరంలోని సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్న ట్లు వెల్లడించింది. దానిలో అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తు న్నాయని అధికారులు పేర్కొన్నారు. దాడు లు కొనసాగుతున్నందున సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని కువైట్ సైన్యం ప్రజలకు సూచించింది. మరోవైపు ఆ దేశ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఇంధన ట్యాంకులు, పలు ప్రభుత్వ భవనాలకు అంటుకున్న మంటలను పూర్తిగా అదు పులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక దళం పేర్కొంది. సౌదీ అరేబియా, ఖతార్లలోనూ దాడులు కొనసాగుతున్నా యి.

గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్ అధ్య క్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. టెహ్రాన్ ఆయా దేశాలపై దాడులు కొనసాగిస్తుండడం గమనార్హం. దుబాయ్‌పై 16 బాలిస్టిక్ మిస్సైల్స్, 121 డ్రోన్లతో ఇరాన్ బీభత్సం సృష్టించింది. అప్రమత్తమైన దుబాయ్ ఆర్మీ 15 మిస్సైల్స్, 119 డ్రోన్లను కూల్చివేసింది. ఇంకోవైపు దుబా య్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరాన్ మళ్లీ లక్ష్యంగా ఎంచుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో తీవ్రస్థాయిలో దాడి చేయడంతో ఎయి ర్‌పోర్టు పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుం ది. దీంతో తాత్కాలింగా విమానాల రాకపోకలకు అంతరాయం ఎదురైంది. అదే సమయంలో ఖతార్, సౌదీ అరేబియాపైనా ఇరాన్ దాడిచేసింది. ఇంకోవైపు టెహ్రాన్ అం తటా భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది.

అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నందున అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు స మాచారం. మరోవైపు ఇరాన్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ రాజధాని అయిన బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకుంటున్నందువల్ల ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని స్థానిక ప్రజలను హెచ్చరించింది. సెంట్ర ల్ బీరుట్‌లోని ఓ హోటల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు ప్రాణాలు కో ల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

హిజ్బుల్లా వెంటనే లొంగిపోవాలి : లెబనాన్ విదేశాంగ మంత్రి

లెబనాన్ హిజ్బుల్లాను వెంటనే ఆయుధాలతో లొంగిపోవాలని కోరింది. ఈ మేరకు ఆదివారం అనేక అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను లెబనాన్ విదేశాంగ మంత్రి యూసఫ్ ఖండించారు. హిజ్బుల్లా సైనిక చ ర్యలు లెబనీస్ ప్రభుత్వాన్ని ప్రతిబింబించ డం లేదని స్పష్టం చేశారు. అరబ్ లీగ్ సమావేశంలో తన వ్యాఖ్యలను ఎక్‌లో పోస్టు చేశా రు. గల్ఫ్ దేశాలు, జోర్డాన్, ఇరాక్‌లను లక్ష్యంగా చేసుకునే దాడులను లెబనాన్ తీ వ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. హిజ్బు ల్లా తన ఆయుధాలను వెంటనే అప్పగించాలని కూడా లెబనాన్ విదేశాంగ మంత్రి యూసఫ్ పిలుపునిచ్చారు.

లిమిట్‌గా ఇరాన్

బాలిస్టిక్ క్షిపణుల శ్రేణి

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల శ్రేణిని పరిమితం చేసింది. అంతేకాదు అమెరికా భూ భాగాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలను ఖండించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆదివారం మాట్లాడుతూ, టెహ్రాన్ ఉద్దేశపూర్వకంగా తన బాలిస్టిక్ క్షిపణులను 2,000 కిలోమీటర్ల (1,240 మైళ్ళు) పరిధిలోకి పరిమితం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం ముప్పుగా భా వించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌బీసీ మీట్ ది ప్రెస్‌తో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ క్షిపణి శ్రేణులను విస్తరించే ప్రణాళికలేవీ లేవన్నారు. అమెరికా భూభాగాన్ని చేరుకోగల దీర్ఘ-శ్రేణి క్షిపణులను ఆ దేశం అభివృద్ధి చేస్తోందని సూచించే ఆధారాలు లేవని అరాగ్చి తెలిపారు. 

రష్యాతో ఇరాన్ సైనిక సహకారం

 రష్యాతో సైనిక సహకారం కొనసాగుతుందని ఇరాన్ తెలిపింది. రష్యాతో సైనిక సహకారం కొనసాగుతోందని, దీర్ఘకాలంగా స్థిరపడిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అన్నారు. ఇరాన్ మాస్కో నుంచి సహాయం పొందుతోందా అని అడిగినప్పుడు, రెండు దేశాలు చాలా సంవత్సరా లుగా సైనిక సంబంధాలను కొనసాగిస్తున్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరిం చారు. ‘మాకు రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇరాన్, రష్యా మధ్య సైనిక సహకారం కొత్త విషయం కాదు. ఇది రహ స్యం కాదు. ఇది గతంలో ఉందని, ఇప్పటికీ కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా ఉం టుంది’ అని ఆయన చెప్పినట్లు సమాచారం.

ఇరాన్ కొత్త క్షిపణి దాడి షురూచేసింది : ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త క్షిపణి దాడిని ప్రారంభించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిని ఎదుర్కోవడానికి వైమానికదళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇరాన్ తన భూభాగం వైపు కొత్త క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయె ల్ సైన్యం నివేదించిం దని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. రాబోయే దాడులను అడ్డుకోవడానికి తమ సైన్యం మోమరించిందని చెప్పింది.

దుబాయ్‌లోని 23 మెరీనాపై ఇరాన్ డ్రోన్ దాడి

దుబాయ్ నగరంలోని అత్యంత ఉన్నతస్థాయి వాటర్ ఫ్రంట్ జిల్లాల్లో ఒకటైన దుబాయ్ మెరీనాలోని లగ్జరీ టవర్ నుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి శనివారం దుబాయ్‌లోని 23 మెరీనా టవర్‌ను ఢీకొట్టింది. దీనితో ఆ భవనం నుంచి మంటలు చెలరేగాయి. దాదాపు 90 అంతస్తుల ఎత్తున్న ఈ భవనంలో సంపన్న ప్రవాసులు, అంతర్జాతీయ నిపుణులు, విదేశీ పెట్టుబడిదారులు నివసిస్తున్నారు. 


ఇవి కూడా చదవండి:

ఇరాన్‌పై మిస్సైళ్ల తుఫాన్

మమతను దేశం క్షమించదు

నేపాల్ ప్రధానిగా బాలెన్ షా