100 డాలర్ల మార్క్ దాటేసిన బ్యారెల్ ముడిచమురు ధర
న్యూఢిల్లీ: ప్రధాన ముడి చమురు ఉత్పత్తిదారు ఇరాన్‌పై(Iran Israel War) ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతుంది. బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేయడంతో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. మూడున్నరేళ్లలో ఒక బ్యారెల్ ధర స్థాయికి చేరడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసే సూచనలు లేకపోవడంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. షికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ బ్యారెల్ బ్రెంట్ క్రూడ్(Crude Oil Price) ధర 114 డాలర్లకు ఎగబాకింది. 2022 తర్వాత తొలిసారి బ్యారెల్ ముడిచమురు ధర 114 డాలర్లకు చేరింది.
గత శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర(Brent Crude Oil ) 92.69 డాలర్లు వద్ద ముగిసింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ స్వీట్ క్రూడ్ ఆయిల్ ధర 114 డాలర్లకు చేరింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు రవాణకు ఆటంకం కలిగింది. నిత్యం హార్ముజ్ జలసంధి ద్వారా 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. చమురు రవాణా నిలిచిపోవడంతో ముడిచమురు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇరాన్ , కువైట్, యూఏఈ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడితో చమురు ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేని పరిస్థితులు కనబడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




