గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్
మఠంపల్లి,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ఇంటి రవి ఆధ్వర్యంలో ఏఐటీయూసీల చేరగా వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ఏఐటీయూసీ కండవలను కప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీ చేసే 51 జీవోను సత్యమే రద్దు చేయాలని,మల్టీపర్పస్ విధానానికి స్వస్తి చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతినిత్యం పనిచేస్తున్న గ్రామపంచాయతీ కామాటీలకు అధిక జీతం ఇవ్వాల్సింది పోయి ఉన్న జీతాలు సగానికి ఇవ్వడం దారుణమైన విషయమని తక్షణమే శ్రమ దోపిడికి వ్యతిరేకంగా సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.






