ఉద్యమకారుల..... ఆత్మ గౌరవంకై ఎలుగెత్తి నినదించండి
హలో ఉద్యమకారుడా.... చలో గన్ పార్క్
టియు జేఏసీ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి పిలుపు
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజాపాలన అంటూనే పేదల ఇళ్లపై ఖమ్మంలో బుల్డోజర్లతో నేలమట్టం చేయడంతో పేదలు రోడ్డున పడ్డారని ఈ రాచరిక పాలన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిందని ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈనెల 10వ తేదీన జరిగే మిలీనియం మార్చ్ డేకు ప్రతి ఒక్కరు కదిలి వచ్చి జయప్రదం చేయాలని టీయు జెఎసి రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో టియుజెఏసి రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని ఎత్తి పట్టే మిలీనియం మార్చ్ నీ జయప్రదం చేయాలని కోరుతూ శనివారం చలో గన్ పార్క్ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధనలక్ష్మి హాజరై మాట్లాడుతూ... ఉద్యమకారుల సంక్షేమం పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధపడుతున్న ముస్కు వేషాలను ఎవరు నమ్మవద్దని ప్రజలు ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి బూటకపు మోసాలకు తావు లేకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు చట్టబద్ధమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యమకారులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మిలీనియం మార్చ్ డే ను, తమ పోరాట స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని గొంతెత్తి నినదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జావేద్, మోనార్ దుర్గాప్రసాద్, సయ్యద్, పెరక సునీత, షేక్షావలి, శంకర్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




