22 April, 2026 | 2:12 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో కిడ్స్ మార్కెట్ ప్రారంభించిన ఎంఈఓ నాగేశ్వరరావు

25-02-2026 01:32 AM

బాన్సువాడ, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో  మంగళ వారం రోజు చిన్నారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కిడ్స్ మార్కెట్ అత్యంత విజయవంతంగా జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, ఆత్మవిశ్వాసం, బాధ్యతాభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ రావు  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలను కూడా నేర్పాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య నరేష్  మాట్లాడుతూ, పిల్లల సమగ్రాభివృద్ధి కోసం విద్యతో పాటు ప్రాయోగిక అనుభవాలు కూడా అవసరమని తెలిపారు.

తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లల స్టాల్స్ వద్ద వస్తువులు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పద్మ, తేజస్వి, రేఖ, సౌభాగ్య, వీణ, సునీత, మౌనిక, మనీషా, సవిత, మానస తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చిన్నారులు స్వయంగా స్టాల్స్ ఏర్పాటు చేసి, వివిధ హస్తకళలు, ఆహార పదార్థాలు మరియు సృజనాత్మక వస్తువులను ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించారు.

పిల్లలు కస్టమర్లతో మాట్లాడడం, ధర నిర్ణయించడం, లావాదేవీలు నిర్వహించడం వంటి అంశాల్లో చురుకుదనం ప్రదర్శించారు. ఇది వారికి భవిష్యత్తులో వ్యాపార దృక్పథం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదపడుతుంది.

కార్యక్రమం మొత్తం ఆనందభరిత వాతావరణంలో సాగి, తల్లిదండ్రులు మరియు అతిథుల ప్రశంసలు అందుకుంది. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది వేస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.మాజీ  కౌన్సిలర్ నందకిశోర్,మాజీ ఎంపీటీసీ సాగర్ షిండే ,పంతులు రాము, యండమూరి వర ప్రసాద్,ప్రచేతన్ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.