19 May, 2026 | 4:16 AM

రేపు మెడికల్ షాపుల బంద్

19-05-2026 12:49 AM

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్‌లైన్‌లో మందుల అకమ్మకాల కోసం తెచ్చిన జీఎస్‌ఆర్ 817, అలాగే కార్పొరేట్ వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులు, మార్కెట్లోకి వస్తున్న వాటిపై కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినప్పటకి స్పందించక పోవడంతో ఈ నెల 20న మందుల దుకాణాలు బంద్ పాటిస్తున్నట్టు నిజామాబాద్ జిల్లా కె మిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నల్ల మదుసుధన్, జిల్లా ప్రధాన కార్యదరి బీర్కుర్ సుధాకర్ సోమవారం వెల్లడించారు.

తమ జాతీయ సంస్థ అయిన ఏఐ వోసీడి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒకరో జు బంద్ పాటిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర సంస్థ అయిన టీటీడీసీఏ నిర్వహించిందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం స్థానిక అసోసియేషన్ కార్యలయంలో ఆవిష్కరించారు. కార్య క్రమంలో జిల్లా కోశాధికారి మోర సాయిలు, అసొసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.