ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
మండల సీఐటీయూ అధ్యక్షుడు నరేష్
మేడ్చల్ అర్బన్, మే 1౮ (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ నియోజకవర్గ బిఅర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ మండల సిఐటియు అధ్యక్షులు ఎం నరేష్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్ లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు అత్యధికంగా ఉన్నారని నరేష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
నేటికి ఆశా వర్కర్ లకు ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వ తేదీ వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ లు నిరవధిక సమ్మె చేశారని నరేష్ ఎమ్మెల్యేకు తెలియజేశారు.ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం కోసం 20 డిమాండ్ లతో కూడిన లెటర్ ను మేడ్చల్ ఎమ్మెల్యేకు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.రానున్న శాసనసభ సమావేశంలో ఆశా వర్కర్ల సమస్యలపై తప్పకుండా ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే మల్లారెడ్డి హామి ఇచ్చినట్లు ఎం నరేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల మేడ్చల్ మండల యూనియన్ అధ్యక్షురాలు పద్మ.నాయకురాళ్లు మమత.రాణి.శశికళ.సంతోష తదితరులు పాల్గొన్నారు.






