మేడ్చల్ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి
మున్సిపల్ మాజి వైఎస్ చైర్మన్ చీర్ల రమేష్
మేడ్చల్ అర్బన్ మే 1౮ (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మేడ్చల్ మున్సిపల్ మాజి వైఎస్ చైర్మన్ చీర్ల రమేష్ మేడ్చల్ జిల్లా ఇంచార్జి దుద్దిల్ల శ్రీధర్ బాబుని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న కారణంగా అనేక కుటుంబాలు ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం మేడ్చల్ కు దూర ప్రాంతంలో ఉండడం వలన సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బందికి గంట నుండి గంటన్నర సమయం పడుతుందని సిహెచ్ రమేష్ మంత్రికి వివరించినట్లు తెలిపారు.అప్పటికే బారి నష్టం ఏర్పడి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన స్పష్టం చేశారు.మేడ్చల్ మున్సిపల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇక్కడ పెద్దఎత్తున ఇండస్ట్రీల, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్ఞ సముదాయాలు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితులలో ప్రజల ప్రాణాలు విద్యార్థుల భద్రత, ఆస్తుల రక్షణ కోసం మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చీర్ల రమేష్ మంత్రి శ్రీధర్ బాబును కోరినట్లు చెప్పారు.అలాగే మేడ్చల్ లో నిర్మాణంలో ఉన్నటువంటి ఐటీ హబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ గిర్మాపూర్ మాజి ఉపసర్పంచ్ బొక్క రఘుపతి రెడ్డి.కాంగ్రెస్ పార్టీ నాయకులు వై నాగరాజు గౌడ్.ప్రశాంత్.నాగార్జున.వేణు తదితరులు పాల్గొన్నారు.






