25 July, 2026 | 2:39 AM

గిరిజన గ్రామాల్లో వైద్యశిబిరాలు

25-07-2026 12:00 AM

ములకలపల్లి, జూలై 24 (విజయక్రాంతి): స్థానిక మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని మారు మూల గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాధికారి సాయి కళ్యాణ్ మారుమూల గుత్తి కోయ గ్రామమైన చేత వాగు, రాసన్నగూడెం, మోతు గూడెం గ్రామాలలో నిర్వహించిన వైద్య శిబిరాల్లో పాల్గొని వైద్య సేవలందించారు. మొ త్తం 80 మందిని పరీక్షించారు. డాక్టర్ సా యి కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సీజన్లో కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా అంటువ్యా ధులను అరికట్టవచ్చని తెలియజేశారు.