25 July, 2026 | 1:51 AM

దళిత సామాజిక వర్గాలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలి

25-07-2026 12:00 AM

కొత్తగూడెం టౌన్,  జులై 24 ( విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళిత అభ్యర్థులకు 15% రిజర్వేషన్లు అమలు చేయాలని, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబు మాట్లాడుతూ, తెలంగా ణ బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్  సూచన మేరకు ఈ వినతిపత్రా న్ని అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఎస్సీ జనాభా కి అనుగుణంగా రిజర్వేషన్లు వర్తింపజేసిందని తెలి పారు. 2026లో కూడా ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలనారు.

భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగు ణంగా..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న పాలసీ ప్రకారం. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు రాజకీయరంగం లో  వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కర్యదర్శి వెంక న్న నాయక్, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు గాయత్రీ, చుంచుపల్లి మండల అధ్యక్షులు శ్రీథర్ తదితరులు పాల్గొన్నారు.