సీఎం సార్.. మా ఆవేదనను చదవండి
రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులతో కేజీబీవీ ఉద్యోగులు
దేవరకద్ర, జూలై 24: సీఎం సార్ గత 15 ఏళ్ల నుంచి ఎప్పుడైనా తమకు మేలు చేసే శుభవార్త వస్తుందని ఆశించి ఎదురుచూస్తూ పనిచేస్తున్న మా ఆశలు ఫలించడం లేదం టూ దేవరకద్ర కేజీబీవీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు పంపించారు. మేము ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మా ఆవేదనను పోస్టు కార్డుల ద్వారా తమ కు తెలియజేస్తున్నామని పూర్తిస్థాయిలో త మ సమస్యలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని విన్నవించారు.
ఎక్కడ పనులు చేసిన సమయపాలన ఉంటుందని కేజీబీవీలో ఉద్యోగం చేస్తున్న మాకు ఇలాంటి నిబంధనలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మేలు చేసే వి ధంగా నిబంధనలను అమలు చేయాలని కో రారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, టిఎస్ యుటిఎఫ్ దేవరకద్ర మండల అధ్యక్షుడు కె.శంకర్, ప్రధాన కార్యదర్శి డి. కృష్ణ, మండల కార్యదర్శి దేవేంద్రప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అనురాధ, సిబ్బంది రేణుక, రాధిక, విజయలక్ష్మి, పావని, జ్యోతి, ప్రభ, సుజాత తదితరులు పాల్గొన్నారు.






