24 April, 2026 | 3:06 AM

రోడ్డుపై వ్యర్థాలు కనపడకుండా చర్యలు

24-04-2026 01:29 AM

మల్కాజ్‌గిరి ఎంఎంసీ కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి

సికింద్రాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): దోమల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు ఎంఎంసీ కమీషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు.రోడ్డుపై ఎలాంటి వ్యర్ధాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ -ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వెస్ట్ మారెడ్ పల్లిలోని ఆశ్విని కాలనీ, నెహ్రూ నగర్ పార్కు, హస్మత్ పేట్ చెరువు, రాజరాజేశ్వరీ కాలనీల్లో అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు.

మొదట సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని నెహ్రూ నగర్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్  స్థానిక నివాసితులు, సీనియర్ సిటిజన్లతో మాట్లాడి పార్క్లో ఉన్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. పార్కులోని ఫౌంటెన్ను పునరుద్ధరిం చాలని, సీనియర్ సిటిజన్లకు కొత్త ఫిట్నెస్ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన కమీషనర్  కొత్త జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని, పార్క్ నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్క రించాల ని ఆదేశించారు.

అంజయ్య నగర్‌లో  వినాయక నిమజ్జనం, హాస్మత్ పేట్ చె రువును పరిశీలించారు. అలాగే నెహ్రూ నగర్ ప్లే గ్రౌడ్‌లో జరుగుతన్న సమ్మర్ కోచింగ్ క్యాం ప్ 2026ను సందర్శించారు. ఈ సందర్భం గా సమ్మర్ క్యాంప్లో పాల్గొంటున్న విద్యార్థులతో ముచ్చటించి, క్రీడలలో రాణిస్తూ మం చి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రోత్సహించారు. పర్యటనలో డీసీ డాకూ నాయక్, డీపీఓ, డీఈ, ఎస్హెచ్జీ సభ్యులు, యూసీడీ సిబ్బంది, యూబీడీ మేనేజర్, ఏఎంసీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.