17-02-2026 05:59:42 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని కెసిఆర్ జన్మదినము పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా తెలంగాణను నిలిపిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన సంక్షేమం సేవలు కావాలని అన్నారు.
ప్రజల దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు.అనంతరం గోపాల్పేట్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, గోపాల్పేట్, వాడి, కన్నారెడ్డి గ్రామల సర్పంచ్లు సాయిలు, వంశీకృష్ణ గౌడ్, మహేందర్, సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా, రాజిరెడ్డి, దుర్గారెడ్డి, మిద్దె బాబురావు, దేశబోయిన సాయిలు, ఫరీద్, నారాయణ, నరేష్, పరిశోధన్ రెడ్డి, పీకే రాజు, గోపాల్, హనుమంత్ రెడ్డి, జయరాజు, పడమటి దుర్గేష్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.