3 May, 2026 | 1:45 AM

జేమీసన్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు

03-05-2026 12:37 AM

వైభవ్ వికెట్ తీసి ఓవరాక్షన్

ముంబై, మే 2: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతిగా ప్రవర్తిం చిన కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌కు రిఫరీ షాకిచ్చారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడు తున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత జేమీసన్ అత్యంత దూకుడుగా వ్యవహరించాడు. వికెట్ తీసిన ఆనందంలో ఆ కుర్రాడికి దగ్గరగా వెళ్లి విరుచుకుపడుతూ సెండాఫ్ ఇచ్చాడు.

ఓ సీనియర్ అంతర్జాతీయ బౌలర్, కెరీర్ ఇప్పుడే మొదలుపెట్టిన చిన్న పిల్లాడితో ఇలా ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను, నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చా యి. అటు అంపైర్ల నివేదికతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. జేమీసన్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి అతనికి ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించడంతో పాటు తీవ్రంగా హెచ్చరించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను జేమీసన్ ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు.

ప్రత్యర్థి ఆటగాడిని కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు ఈ శిక్ష విధించారు. జేమీసన్ కూడా తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వైభవ్ వికెట్ తీసిన తర్వాత జేమీసన్ ఆ కుర్రాడి ముఖానికి అత్యంత దగ్గరగా వెళ్లి దూకుడు ప్రదర్శించిన తీరు, బ్యాటర్‌ను ఆగ్రహానికి గురిచేసేలా ఉంది. లెవెల్-1 నిబంధనల కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.