9 June, 2026 | 4:53 AM

రోడ్డు ప్రమాదంలో తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మృతి

09-06-2026 01:34 AM

నాగిరెడ్డిపేట్,జూన్ 8 (విజయ క్రాంతి):రోడ్డు ప్రమాదంలో తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మృతి.స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపాయిన వివరాల ప్రకారం మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుదేకుల అజీమ్ (73) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.అజీమ్ జూన్ 7 తేదీ సాయంత్రం అజీమ్ మాల్తుమ్మెద గేట్ నుంచి పోచారం గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా,కిరణ్ బార్బర్ షాప్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చి ఆటో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆయనకు తలకు,ఎడమ చేతికి,శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.కుటుంబ సభ్యులు వెంటనే గోపాల్పేట్లోని జేఎస్‌ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా,అనంతరం మెరుగైన వైద్యం కోసం మెదక్లోని సూఫీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు.మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ హాజీ ఫాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.