28 July, 2026 | 1:46 AM

ఈసారి.. పంజాబ్!

28-07-2026 12:57 AM
  1. విద్యార్థుల తీవ్ర నిరసనలు
  2. ‘ఫార్మసీ ఆఫీసర్’ పరీక్షాపత్రాల లీక్‌పై ఆగ్రహం
  3. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌సింగ్ బేన్స్ రాజీనామాకు డిమాండ్
  4. కేంద్రం బాధ్యతలు, పారదర్శకత.. పంజాబ్‌కు వర్తించవా?: బీజేపీ, ప్రతిపక్షాల విమర్శలు

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఈసారి పంజాబ్ వంతయ్యింది.. తాజాగా పంజాబ్‌లోనూ విద్యార్థుల నిరసనలు, ధ ర్నాలు మొదలయ్యాయి. జూలై 19న ‘ఫార్మ సీ ఆఫీసర్’ నియామక పరీక్ష నిర్వహణ త ర్వాత, పంజాబ్ వ్యాప్తంగా రాజకీయ అలజడి, విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చే స్తూ కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్షాలతో పాటు వేలాది మంది అభ్యర్థులు వీధుల్లోకి వచ్చారు.

దీనిపై ఆప్ ప్రభుత్వం మాత్రం పరీక్షాపత్రం లీక్ కాలేదని, కేవలం కొన్ని కేంద్రాల్లో జరిగిన మాల్ ప్రాక్టీస్‌ను ఇన్విజిలేటర్లు, పోలీసులు వెంటనే అడ్డుకున్నారని స్పష్టం చేసిం ది. కానీ ఈ వ్యవహారంలో అభ్యర్థులు, సూ త్రధారు లతో కలిపి దాదాపు 30 నుంచి 35 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ పోస్టుల కోసం ఈ నెల 19న జరిగిన పరీక్షలో హైటెక్ అక్రమాలు వె లుగుచూడటంతో ఈ వివాదం చెలరేగింది.

పరీక్ష కేంద్రాల్లో నిఘా కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి ఆధునిక సాధనాల ను ఉపయోగించి, మాస్ కాపీయింగ్‌కు పా ల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్య వహారంలో అభ్యర్థులు, సూత్రధారు లతో కలిపి దాదాపు 30 నుంచి 35 మందిని పో లీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం పరీక్షా పత్రం లీక్ జరగలేదని, కేవలం కొన్ని కేంద్రా ల్లో జరిగిన మాల్ ప్రాక్టీస్‌ను ఇన్విజిలేటర్లు, పోలీసులు వెంటనే అడ్డుకు న్నారని స్పష్టం చేసింది.

అయితే, పోటీ పరీక్షల పారదర్శకత ను కాపాడటంలో వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శకులు ఆరోపిస్తున్నా రు. జలంధర్, చండీగఢ్, పటియాలా వంటి నగరాల్లో విద్యార్థులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. “మెరిట్‌కే న్యాయం జరగాలి”, “బేన్స్ తక్షణమే దిగిపోవాలి” అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు.

గతంలో పీఎస్‌ఈబీ 12వ తరగతి, పీఎస్‌టీఈటీ పరీక్షలలో కూడా ఇలాంటి అక్రమాలే జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఉ ద్యోగ  నియామకాలపై నమ్మకం పోతోందన్నారు. ఎన్నో నెలల పాటు కష్టపడి సిద్ధమైన అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాల విమర్శలు.. కేంద్ర వైఖరిపై ప్రశ్నలు

కాంగ్రెస్ నాయకులు విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా గళమెత్తారు. పంజాబ్ కాం గ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్‌సింగ్ బజ్వా మాట్లాడుతూ---.. నీట్ పశ్నాప త్రం లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆప్ డి మాండ్ చేసిన తీరును గుర్తుచేశారు. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థుల మాట విన్న ప్రభుత్వం, పంజాబ్ యువత ఆక్రందనను ఎందుకు విస్మరిస్తోందంటూ బజ్వా ప్రశ్నించారు.

ఈ వ్యవహారాల్లో కేంద్రం తీసుకున్న బాధ్యత, పారదర్శకత ప్రమాణాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయని వారు స్పష్టం చేయడం గమనార్హం. మరోవైపు బీజే పీ కూడా ఆప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జాతీయ స్థాయిలో పేపర్ లీకేజీలపై రాద్ధాంతం చేస్తూ, సొంత రాష్ర్టంలో జరుగుతున్న అక్రమాలను తక్కువ చేసి చూపే ప్ర యత్నం చేస్తోందని ఆరోపించింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్-ఛార్జ్ అమిత్ మాల్వియా మా ట్లాడుతూ.. ప్రశ్నాపత్రాల కోసం అభ్యర్థులు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు వార్త లు వస్తున్నా ఆప్ ఎందుకు మౌనంగా ఉం దో చెప్పాలని నిలదీశారు. 

ఉధృతం అవుతున్న విద్యార్థి ఉద్యమం

సామాజిక మాధ్యమాల వేదికగా విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఏకమవుతుండటంతో ఈ ఆందోళన రోజురోజుకూ ఉధృత మవుతోంది. జరిగిన లీక్ వ్యవహారాలపై న్యా య విచారణ, అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించడం, పరీక్ష భద్రత కోసం ఏఐ ప్రాక్టరింగ్, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు, కఠినమైన ఇన్విజిలేషన్ వంటి చర్యలను అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నా రు. అలాగే మంత్రి బేన్స్ రాజీనామా అంశం కూడా ఉద్యమంలో ప్రధాన డిమాండ్‌గా కొనసాగుతోంది.

నిరసన తెలుపుతున్న వి ద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారన్న వార్తలు, జలంధర్‌లో జరిగిన ఘర్షణల వీడియోలు ఆందోళనలకు, విమర్శలకు మ రింత ఆజ్యం పోశాయి. భగవంత్ మాన్ ప్ర భుత్వానికి ఇదిపెద్ద రాజకీయ సవాలుగా మారింది. సుపరిపాలన, విద్యారంగంలో సంస్కరణల హామీతో అధికారంలోకి వచ్చిన ఆప్‌కు, వరుసగా జరుగుతున్న ఈ వివాదా లు మింగుడుపడటం లేదు.

సమగ్ర ద ర్యాప్తు, బాధ్యులపై కఠినమై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్ప టికీ.. ప్రతిపక్షాల ఐక్యత, విద్యార్థుల పట్టుదల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మ రింత ఉధృతం అయ్యే అవకాశం కనపడుతోంది. పంజాబ్ యువత ఇప్పుడు కేవలం ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత లభించే పా రదర్శక వ్యవస్థను బలంగా ఆకాంక్షిస్తోంది.

లీక్ కాదు.. కాపీయింగ్: విద్యాశాఖ మంత్రి

ఈ విమర్శలను పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్ గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘ఇది పేపర్ లీక్ కాదు, కేవలం కాపీయింగ్ చేసే ప్రయత్నమే. దాన్ని అక్కడికక్కడే అడ్డుకుని నిందితులను అరెస్ట్ చేశాం. నా రాజీనామా వల్ల వ్యవస్థ మెరుగు పడుతుందంటే, నిమిషాల్లో దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు. ఆప్ ప్రభుత్వం సున్నా ఉపేక్ష (జీరో టాలరెన్స్) విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు.