28 July, 2026 | 1:50 AM

లోక్‌సభలో పరీక్షల బిల్లు

28-07-2026 01:15 AM
  1. సభలో విపక్షాల నిరసనలు
  2. విద్యార్థులపై లాఠీచార్జికి క్షమాపణల డిమాండ్
  3. హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని పట్టు
  4. పార్లమెంట్ వెలుపల ‘ఇండియా కూటమి’ నిరసనలు
  5. ఉభయ సభల్లోనూ గందరగోళం.. సభలు నేటికి వాయిదా

న్యూఢిల్లీ, జూలై ౨7: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభ లో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెం ట్ బిల్లు- 2026’ను ప్రవేశపెట్టింది. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీ నివారణ, నిర్వహణ లోపాలు, అక్రమాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేలా బిల్లు రూపొందించినట్లు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

బిల్లు ద్వారా వ్యవ్యవస్థీకత నేరాలకు పాల్పడే వారికి కనీసం 7 నుంచి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని, దోషులకు రూ.10 కోట్ల వరకు జరిమానాలు వి ధించే వెసులుబాటు వస్తుందని తెలిపింది. ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ౬ గంటల ప్రత్యేక సమ యం కేటాయించారు. 20వ తేదీన ఢిల్లీలో ‘చలో పా ర్లమెంట్’లో పాల్గొన్న విద్యార్థులపై లాఠీచార్జి, పెల్లెట్ గన్స్ వాడకంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.

విద్యార్థులపై దాడులు చేయడం దా రుణమని, బీహార్‌లో విద్యార్థులపై ఏకే -47 తో కాల్పుల అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని భీష్మించుకు కూర్చున్నారు. ‘అమిత్ షా డౌన్.. డౌన్’ అంటూ నినదించారు. అలాగే, కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బిల్లును సైతం వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీ లు అందుకు అభ్యంతరాలు తెలిపారు.

ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్పీక ర్ 3 గంటల పాటు విరామం ప్రకటించారు. మధ్యాహ్నం ౨ గంటల వరకు సభను వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైన తర్వాత, గందరగోళం ఏర్పడిండటంతో స్పీకర్ మళ్లీ సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేయగా, తర్వాత కూడా సభ వాయిదా పడింది. రోజంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో చివరకు స్పీకర్ సభను మంగళవారా నికి వాయిదా వేశారు.

విపక్షాల ప్రశ్నలు.. నిలదీతలు

మధ్యాహ్నం ౨ గంటల తర్వాత సభ ప్రా రంభమైంది. తర్వాత విపక్షాల నుంచి కాంగ్రె స్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బిల్లుపై అభ్యంతరాలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు తీవ్రమైన గాయానికి ‘బ్యాండ్ ఎయిడ్’ వేసే ప్రయత్నంలా ఉం దని ఎద్దేవా చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వి షయంలో సంస్కరణలు తీసుకురావడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించా రు.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ మాట్లాడుతూ.. పేపర్ లీక్ అయిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, అసలు పేపర్ లీక్‌కు ఆస్కారం లేని విధానం అమలు కావాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విద్యార్థుల ప్రయోజనాల కంటే విపక్షాలకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమయ్యాయని నిప్పులు చెరిగారు.

రాజ్యసభలోనూ నిరసనలు

రాజ్యసభలోనూ బిల్లుపై చర్చ జరగకుండానే రోజంతా వాయిదా పడింది. మధ్యా హ్నం 3 గంటలకు సభ పునఃప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ ను పరిశీలనలోకి తీసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి నినాదాలు చేశారు.

రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖార్గే మాట్లాడుతూ.. విపక్షాలు చర్చకు సిద్ధం గా ఉన్నప్పటికీ, ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎం దుకు సభకు వచ్చి ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాజ్యసభను తొలుత సాయంత్రం 5:15 గంటల వ రకు, ఆ తర్వాత మంగళవారానికి డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు.

పార్లమెంట్ వెలుపల ఆందోళన

సమావేశాలు ప్రారంభానికి ముందు ఉదయం ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈనెల 20న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జిని ఖండిస్తూ నినాదాలు చేశారు.