28 July, 2026 | 2:38 AM

ధర్మేంద్ర ప్రధాన్‌కు ఘనస్వాగతం

28-07-2026 01:47 AM

పార్లమెంట్ వద్ద ఎన్డీఏ ఎంపీల సన్మానం

న్యూఢిల్లీ, జూలై 27: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మం త్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు సోమవారం పార్లమెంట్ వద్ద ఎన్డీ ఏ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఆయనను శాలువాలతో సత్కరించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. సోమవారం ప్రధాన్ రాకకు ముందే ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ ప్రవేశ ద్వారం వద్ద గు మిగూడారు.

ఆయన ప్రాంగణంలోకి ప్రవేశించగానే, పార్టీ సహచరులు ఆయనకు స్వా గతం పలికి, లోపలికి తీసుకెళ్లి, సన్మానించా రు. ఈ స్వాగత కార్యక్రమం మధ్యలోనే కాం గ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ ప్రధాన్‌ను కలిసి, ఆయన రాజీనామా పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ‘అలా జరుగుతూ ఉంటుంది’ అని అన్నారు. ‘ఏమీ జరగలేదు’ అని ప్రధాన్ వెంటనే బదులిచ్చారు. ఆ తర్వాత ‘నేను వీధి యోధుడిని.

ఏసీ గదిలో తిరిగే కార్యకర్తను కాదు’ అని స్పష్టం చేశారు. ప్రధాన్‌కు ఘనస్వాగతం లభించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఎన్డీఏ ఎంపీల తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. దేశ యువతకు ఇది తీవ్ర అవమానమని కాంగ్రెస్ ఎంపీలపై మండిపడ్డారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటులో తన తొలి ప్రసంగాన్ని ప్రధాన్ ఒక రాజకీయ సందేశం పంపేందుకు ఉపయోగించుకున్నారు.