తగ్గనంటే తగ్గను : మోడల్ రియా
ముంబై, జూలై ౨౭: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇచ్చిన పిలుపు మేరకు 27 ఏళ్ల మోడల్ రియా ఆహిర్ ముంబై శివాజీ పార్క్ వద్ద చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. స్టుల్‌గా ఫోజ్ ఇస్తూ, భారీ వర్షంలో కొన్నిగంటల పాటు నించొని, ఒంటిచేత్తో పోలీస్ వాహనా న్ని ముందుకు కదలకుండా అడ్డుకున్న ఆమె తెగువకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వైద్యులు కావాల్సిన ఆ విద్యార్థులు లాఠీచార్జికి బలి అవుతుంటే చూస్తూ ఊరుకోలేకపో యానని, తన వంతుగా ఉద్యమంలో భాగస్వామినయ్యాయని ఆమె మీడియాకు తెలిపారు.
ఈ ఘటన ఆమెకు పేరు ప్రఖ్యాతలతోపాటు ఇబ్బందులూ తెచ్చిపెట్టాయి. తనపై సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్ర చారం జరుగుతున్నదని, కొందరు తన డీప్ ఫేక్ చిత్రాలను పోస్టు చేస్తున్నారని రియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మోడలింగ్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారని వాపోయారు. తనతోపాటు తన కుటుంబ సభ్యు లను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయా ఆంశాలపై ఆమె ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. అలాగే, ముం బై సైబర్ పోలీసులతో సంప్రదింపులు జరుపనున్నారు. తన తండ్రి ఇండో- టిబెటన్ బోర్డర్ సైన్యాధికారి అని, ఎన్ని వేధింపులు ఎదురైనా తాను వెరవనని, ఆయన లక్షణాలనే తాను పుణికి పుచ్చుకున్నానని రియా తేల్చిచెప్పారు.






