28 July, 2026 | 2:17 AM

హైడ్రా రంగనాథ్‌ను తొలగించండి

28-07-2026 01:25 AM
  1. సీఎస్‌కు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశం 
  2. ఒకే అధికారిపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఏంటి?
  3. హైకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పిన రంగనాథ్

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి) : హైడ్రా కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా సోమవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.

రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తక్షణమే తప్పించాలని, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అర్హత కలిగిన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఒకే అధికారిపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండటం అత్యంత ఆందోళనకరమని కోర్టు వ్యాఖ్యానించింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఫెన్సింగ్ తొలగించారని, మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇప్ప టికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం ప్రస్తావించిం ది. ఒకే అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వచ్చాయని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పాటించకుండా వ్య వహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా అని నిలదీసింది. సెక్రటరీ హోదాలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడం న్యాయపాలన స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రతి పౌరుడికి కోర్టు ను ఆశ్రయించే రాజ్యాంగ హక్కు ఉందని, ఆ హక్కును అధికారులు గౌరవించాలని ధర్మాసనం పేర్కొంది. 

కోర్టులపై నాకు సంపూర్ణ విశ్వాసం, అత్యున్నత గౌరవం ఉన్నాయి..

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అఫిడవిట్ సమర్పిస్తూ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. దేశ న్యాయవ్యవస్థపై, కోర్టులపై తనకు సం పూర్ణ విశ్వాసం, అత్యున్నత గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు.

లోతుకుంట సర్వే నంబ ర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి హై డ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎ లాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని అఫిడవిట్‌లో వివరించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ వాస్తవాలను వక్రీకరించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేశారని కూడా ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై బేషరతుగా క్షమాపణలు కోరుతూ, న్యాయస్థానాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని పునరుద్ఘాటించారు.

అయితే రంగనాథ్ సమర్పించిన అఫిడవిట్ తో హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదై ఉండ టం సాధారణ విషయం కాదని, ఇది అధికారుల పని తీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనె త్తుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బలగం, భారీ యంత్రాలు ఉన్నాయని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది.  ఒకే అధికారి చర్యల కారణంగా కోర్టు ధిక్కర ణ కేసులు వరుసగా నమోదవుతుండటం న్యాయపాలనకు మంచిది కాదని పేర్కొంది.

ఇలాంటి పరిస్థితుల్లో అదే అధికారిని అదే పదవిలో కొనసాగించడం సమంజసం కాద ని స్పష్టం చేసింది. లోతుకుంట భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో అమ ల్లో ఉన్నప్పటికీ మళ్లీ అదే భూమికి సంబంధించి చర్యలు చేపట్టడం ఎలా జరిగిందని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. నిబంధనలను, కోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి వ్యవహ రిస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వా సం దెబ్బతింటుందని పేర్కొంది.

రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగితే ‘రూల్ ఆఫ్ లా‘ సూత్రానికే భంగం కలిగే ప్రమాదం ఉం దని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తక్షణమే తప్పించాలని, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది. ఈ ఉత్తర్వులు హైడ్రా వ్యవస్థ పనితీరుతో పాటు కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వ వైఖరిపై చర్చకు దారితీసే అవకాశముంది.