9 May, 2026 | 6:48 PM

Breaking News

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి   •  

నారబోయిన కనకయ్య అంతిమయాత్రలో పలువురు నేతల నివాళి

24-02-2026 12:02 AM

మునుగోడు, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజు తండ్రి, మునుగోడు మండల పరిషత్ రిటైర్డ్ ఉద్యోగి నారబోయిన కనకయ్య (82) గారు మృతి చెందగా, సోమవారం నిర్వహించిన ఆయన అంతిమయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ సిపిఐ రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు పాల్గొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

నారబోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కనకయ్య మరణ వార్త తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఫోన్ ద్వారా నారబోయిన రవిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.