9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

నియ్యత్ ఉంటే రాజీనామా చేయాలి

24-02-2026 12:02 AM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో తెలంగాణ జాగృతి పోటీ

గద్వాల,  ఫిబ్రవరి 23: బీఅర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి నీయ్యత్ ఉంటే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం గద్వాలలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ...  తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భవిష్యత్త్ లో ఓ రాజకీయ పార్టీ ని నిర్మించబోతున్నామని ఏ కార్యక్రమైన గద్వాల్ నుంచి ప్రారంభిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అడవిలో అన్నకు రైతన్నకు బయపడాల్సిన పరిస్థితి వచ్చిందని. ఇవ్వాల నక్సలైట్ అన్నలపై ప్రభుత్వాలు దాష్టికం ప్రదర్శిస్తున్నా యన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో ఇచ్చిన హమీలను నిలబెట్టుకోలేదు అని ఆరోపించారు. రైతులు వ్యవసాయానికి టైం కి యూరియా దొరకడం లేదు అని యూరియ బుక్ చేసుకోవాలంటే యాప్ తప్పని సరి మరి రైతులతో చిన్న పోన్ ఉంది అందరికి ఐ పోన్ కొని వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె డిమాండ్ చేశారు. యూరియా ఇచ్చే చేత కాక కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా ఇవ్వడానికి కొరివిలు పెట్టడంపై ఆమె మండిపడ్డారు. గద్వాల గడ్డమీద ఒక రకమైన రాజకీయం నెలకొందని గెలిచిన వారు అధికార  పార్టీలోకి జంప్ కావడం ఆనవాయితిగా మారిందన్నారు.

బీఅర్‌ఎస్ పార్టీ నుండి గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి దమ్ము దైర్యం ఉంటే నువ్వు రాజీనామ చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. నీతి నిజాయితీ లేని రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఇప్పటికీ గద్వాల ఎమ్మెల్యే బీఅర్‌ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ కిందా నెల నెల డబ్బులు వేస్తున్నట్లు చెప్పుకోవడానికి గద్వాల్ ఎమ్మెల్యే కు ఇంకిత జ్ఞానం లేదా? తీసుకోవడానికి బీఅర్‌ఎస్ పార్టీకి సిగ్గు లేదా అని విమర్శించారు. నడిగడ్డలో తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్న నడిగడ్డ ఎడారి తలపిస్తోందని అని అన్నారు. 

గద్వాలలో అత్తా లేదా అల్లుడే ఎమ్మెల్యేలుగా ఉంటున్నారని  అత్తా అల్లుడు అన్నీ పార్టీలు మారిన బహుజన బిడ్డలు పోటీ చేయడానికి ఏ పార్టీ అవకాశం ఇవ్వడంలేదని, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నడిగడ్డలో ఒక ఆయుదాని నూరుతున్నామని, కొత్తగా వచ్చే రాజకీయశక్తి నడిగడ్డకు వజ్రాయుధమవుతుందని అన్నారు. ఇక్కడి నుంచే మార్పు మొదలవుతుందని అన్నారు.

అనంతరం అనంత ఫంక్షన్ హాల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు గద్వాల పురవీధుల గుండా వారు నడుచుకుంటూ వెళ్లారు.  రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కులపోరాట సమితి నాయకులు, రైతులు పాల్గొన్నారు