కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు
మోదీ వైఖరిని తప్పుబట్టిన మమతా బెనర్జీ.. రాజీనామా చేయాలని డిమాండ్
కోల్ కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై మోదీ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ సారి యుద్ధం జరిగితే కోల్ కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణమంత్రి అన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పాక్ మంత్రి వ్యాఖ్యలపై మోదీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఎన్నికల కోసం మాత్రమే కోల్ కతాను పట్టించుకుంటారా? అని బెంగాల్ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.




