24 April, 2026 | 1:40 PM

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?

24-04-2026 12:17 PM

హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Malla Reddy) కోడలు ప్రీతి రెడ్డి(Preethi Reddy) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని ప్రీతి రెడ్డి కలిశారు. ఇటీవల కుటుంబసభ్యులతో మల్లారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని(Prime Minister Narendra Modi) కలిసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ కార్యాలయానికి ప్రీతి రెడ్డి రాకకు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రీతి రెడ్డి రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును(BJP State President Ramchander Rao) మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రీతి రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి.