24 April, 2026 | 2:31 PM

Breaking News

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •   ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •  

బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్

24-04-2026 01:13 PM

హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం శంకర్ గౌడ్ కుటుంబసభ్యులను కేంద్రమంత్రి పరామర్శించారు. నర్సంపేటకు వెళ్లున్న బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నర్సంపేట మండలం మహేశ్వరం వద్ద బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు ముందుకు వెళ్లేందుకు నిరాకరించారు.

ముత్తోజిపేటకు ఒకే వాహనం మాత్రమే వెళ్లాలని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళి అర్పించడానికి వెళితే ఇబ్బందేమిటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నర్సంపేట సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి ఆగ్రహంతో ముత్తోజీపేట వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కేంద్రమంత్రి రాకతో బీజేపీ శ్రేణులు నర్సంపేటకు భారీగా తరలివచ్చారు.