4 May, 2026 | 1:10 AM

ఎండకు మండిన మక్కజొన్న

04-05-2026 12:00 AM

గాల్పులతో వేగంగా వ్యాపించిన మంటలు

  1.   120 ఎకరాల్లో దగ్ధమైన పంట
  2.   40 మంది రైతులకు రూ.20 లక్షలకు పైగా నష్టం 
  3. ఆదిలాబాద్ జిల్లా కన్గుట్ట గ్రామ శివారులో ఘటన

ఆదిలాబాద్/బోథ్, మే 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామ శివారులోని పంటచేనులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడగాలితో వేగంగా మంటలు వ్యాపించడంతో 40 మంది రైతులకు చెందిన 120 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రతతో  ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ప్రమాదవశాత్తు చెలరేగిన మంట లతో వారి కళ్లెదుటే సుమారు 120 ఎకరాల మొక్కజొన్న పంటను బూడిద అవుతుంటే తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం మొక్కజొన్న చేలలో మంటలు చెలరేగాయి. ప్రస్తు తం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, దానికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు దావానలంలా వ్యాపిం చాయి. నిమిషాల వ్యవధిలోనే వందల ఎకరాలలోని పంటకు మంటలు అంటుకు న్నాయి.

కన్గుట్ట శివారులో ప్రారంభమైన మంటలు.. పక్కనే ఉన్న సాకేర గ్రామ శివా రు వ్యవసాయ భూముల్లోకి వేగంగా విస్తరించాయి. పంట పూర్తిగా ఎండిపోయి, కోత దశలో ఉండటంతో మంటలు త్వరగా అంటుకుని, అగ్ని కీలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. 40 మంది రైతులకు స్పం దించి రూ. 20 లక్షలకు పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా. ఈ ప్రమాదంలో ట్రాన్స్ఫార్మర్ తో పాటు విద్యుత్ మోటార్లు, పైపులు కాలి బూడిద అయ్యాయి.

మంటల తీవ్రతను గమనించిన స్థానికులు, రైతులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అధికారులతో పాటు స్థానిక రైతులు, గ్రామస్తులు సైతం మంటలను అదుపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

కన్నీరుమున్నీరైన మహిళా రైతులు

పంట చేతి కొచ్చిన సమయంలో అగ్ని ప్రమాదం జరగడం రైతులను నిండా ముం చింది. కళ్ళముందే వందల ఎకరాల పంట కాలి బూడిదవ్వడంతో ప్రమాద స్థలంలోనే మహిళా రైతులు కన్నీరు మున్నిరయ్యారు. వాస్తవానికి మొక్కజొన్న పంట కోతకు సిద్ధం గా ఉండాగ, ఒకేసారి కోతలు ప్రారంభం కావడం, హార్వెస్టర్ల (కోత యంత్రాల) కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు తమ వంతు పంట కోత కోసం నిరీక్షించాల్సిన  పరిస్థితి నెలకొంది. ఈ లోపే ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం జరగింది.