7 March, 2026 | 10:55 PM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

07-03-2026 08:59 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే  రైతు భరోసా నిధులను రైతులకు తక్షణమే పంపిణీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ మల్లాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మల్లాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, రైతులు పండించిన మొక్కజొన్నను సరైన ధరకు విక్రయించుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరారు. అలాగే రైతు భరోసా నిధులను ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాచారం భూమారెడ్డి, మండల అధ్యక్షుడు కళ్లెం మైపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు పోచంపల్లి చిన్న రమేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్యాల లక్ష్మణ్, మెరపు గంగరాజం, సంగేపు అనిల్ రెడ్డి, నల్ల అమరేందర్, కొప్పెల రాజశేఖర్ రెడ్డి, ఎలాల శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మణ్, సారుగు దేవయ్య తదితర రైతులు పాల్గొన్నారు.