11 April, 2026 | 11:28 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి

11-04-2026 09:51 PM

 నివాళులు అర్పించిన డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మకరంపుర,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ లు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే , డిసిసి అధ్యక్షులు  మేడిపల్లి సత్యం  మాట్లాడుతూ.... బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యా ప్రదాత జ్యోతిబాపూలే  అడుగుజాడల్లో నడవడమే మన లక్ష్యమని, పూలే ఆశయ సాధనకు కాంగ్రెస్  కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. పూలే ఆశించిన సామాజిక న్యాయం కోసం పోరాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.